జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేయడానికి ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు.
స్వల్పకాల వ్యవధి కోర్సులో ప్రవేశానికి ఇంటర్ పాసైనవారు అర్హులు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన తర్వాత దేశంలోని పేరున్న ఆభరణాల సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యూయెలరీ, న్యూదిల్లీ, ముంబయి
జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ముంబయి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యూయెలరీ, ముంబయి
పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, దిల్లీ, జయపుర, ముంబయి, నొయిడా
ఆర్క్ అకాడమీ ఆఫ్ డిజైన్, జయపుర
సొలిటైర్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్, గోల్కొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్, హైదరాబాద్
రాళ్లను కట్ చేయడం, చెక్కడం, సానబెట్టడం, విలువైన లోహాలు, రాళ్ల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇస్తారు. లోహాలకు వివిధ రంగులు అద్దడం, విద్యుత్ సాయంతో ఒక లోహంపై వివిధ లోహాలను పూత పూయడం, లోహాలపై ఎనామిల్ పూత వేయడం, డిజైన్‌కు అనుగుణంగా లోహాలపై రాళ్లను పొందిగ్గా అమర్చడం, కంప్యూటర్ సహాయంతో నగల డిజైన్లు, నగలను తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు. అధునాతన పద్ధతుల్లో విలువైన లోహాలతో నగలు రూపొందించడం నేర్పిస్తారు.
బంగారం, రత్నాభరణాల డిమాండ్ దృష్ట్యా ఈ కోర్సు పూర్తిచేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలూ పెరుగుతున్నాయి.
ఒకటి లేదా రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సు పూర్తి చేయడానికి సుమారు రూ.65,000 నుంచి 1,80,000 వరకు ఖర్చవుతుంది. తక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సు పూర్తిచేయడానికి రూ.15,000 నుంచి 65,000 వరకు ఖర్చవుతుంది.
వేతనాలు: మొదట్లో రూ. 10,000 వరకు సంపాదించవచ్చు. అనుభవం పెరిగితే నెలకు రూ.20,000 వరకు వేతనం పొందవచ్చు. డిజైనర్లుగా మంచి పేరు తెచ్చుకున్నవాళ్లు నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు. ఫ్రీలాన్సర్‌గా పనిచేసేవారి ఆదాయం పూర్తిగా సృజనాత్మకత, మార్కెట్లో నైపుణ్యాలను ప్రదర్శించే నేర్పు మీద ఆధారపడుతుంది. ప్రముఖ ఆభరణాల సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆభరణాల తయారీ, డిజైన్ చేసే సంస్థలు, జ్యూయెలరీ షాప్‌లు, షోరూమ్‌లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. మార్కెట్లో పరిచయాలను పెంచుకోవడం, అప్పుడప్పుడూ జరిగే ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్లకు హాజరుకావడం ద్వారా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పేరొందిన జ్యూయెలరీ సంస్థ లేదా డిజైనర్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేసినా అనుభవం సంపాదించవచ్చు.
జ్యూయెలరీ డిజైన్ ఫౌండేషన్ కోర్సు, ఇండస్ట్రీ ఓరియంటెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, స్టయిల్స్ ఆఫ్ జ్యూయెలరీ డిజైన్, జ్యూయెలరీ డిజైన్ డిప్లొమా, జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా - బేసిక్, డిప్లొమా ఇన్ జ్యూయెలరీ డిజైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్, జ్యూయెలరీ ఇన్ ఆర్గనైజ్డ్ రిటైల్ అండ్ లైఫ్‌స్టయిల్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్ ఇన్ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ-రైడో-3డి, సర్టిఫికెట్ ఇన్ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ-ఇన్నోవేట్-మ్యాట్రిక్స్, సర్టిఫికెట్ ఇన్ డైమండ్ గ్రేడింగ్, సర్టిఫికెట్ ఇన్ జెమాలజీ (ఇంటర్ పాసైనవారు అర్హులు). జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా - అడ్వాన్స్, డైమండ్స్ అండ్ డైమండ్ గ్రేడింగ్, కలర్డ్ జెమ్‌స్టోన్ ఐడెంటిఫికేషన్ అండ్ డిప్లొమా ఇన్ జెమాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జ్యూయెలరీ మేనేజ్‌మెంట్, మాస్టర్ మెడల్ మేకింగ్‌్ (ఈ కోర్సులకు డిగ్రీ పాసైనవారు అర్హులు).
కొన్ని సంస్థలు దూరవిద్యా కోర్సులనూ అందిస్తున్నాయి.